జగన్ జనాన్ని ఓదార్చి ఓదార్చి, ఒంటి నెప్పులు తెచ్చుకొని ఆసుపత్రి లో పడ్డాడు , ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆయన్ని ఓదార్చే పని లో పడ్డారు.
చంద్ర బాబు పార్టీ మీటింగ్ పెట్టి బాబ్లి ప్రాజెక్ట్ మీద మళ్లీ పోరాటం చేద్దాం, ఆసక్తి ఉన్న వాళ్ళని చేతులు ఎత్తమన్నాడంట, ఒక్కళ్ళు ఎత్తితే ఒట్టు . అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడలేదు మరి, పేరు నీకూ, బడిత పూజ మాకూ అనుకొన్నరో ఎమో, మన తెలుగు తమ్ముళ్ళు.
ఒబామాని తిరుపతి తీసుకెళ్ళాలని చిరంజీవి తహ తహ లాడారు, ఆ మేర 'సింగ్' గారికి ఒక ఉత్తరం ముక్క కూడా రాసారు, కానీ పని వత్తిడి వల్లనో , లేక రోశయ్య వత్తిడి వల్లనో అయన పట్టించుకోలేదు. అలిగిన చిరంజీవి కాంగ్రెస్ నీ , రోశయ్య నీ విమర్శించడం మొదలు పెట్టారు.
ఒబామా భారత పర్యటనకు వస్తున్నాడు అని తెలిసి పిన్నల నుంచి పెద్దల దాక అంతా సందడి చేసారు , ఆయన వచ్చి మనకి నాలుగు మంచి మాటలు చెప్పి , నలభయి వేల ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళకి తీసుకెళ్ళాడు . మనకి రోజుకి వంద కోట్లు ఖర్చు అయ్యింది !.
వెంకయ్య నాయుడు గారు విమానం లో లగేజ్ పోగొట్టుకొన్నారు అంట , మొన్నఆ మధ్య పదవి పోగొట్టుకొన్నారు , ఇప్పుడేమో ఇలా లగేజ్ . ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుంది కాబోలు.
రోశయ్య గారికి కోపం వచ్చింది , ఈ సారి ఆయన్ని అన్నందుకు కాదు, సోనియా మేడంని ఎవరో సుదర్శన్ ఏదో అన్నాడని. సి.ఎం అన్న సంగతి కూడా మర్చిపోయి ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ ని నేషనల్ మీడియా వచ్చేదాకా ఆపేసి తర్వాత వదిలేసాడు అంట , సోనియా గాంధీ చూడాలి కదా మరి. దీని మీద లోక్ సత్తా జయప్రకాశ్ గారు రోశయ్య ని అరెస్ట్ చేయాలి అని మారం చేసారు , షరా మాములుగానే మీడియా ఆయన్ని పట్టించు కోలేదు.
బక్క ప్రాణి కే.సి.ఆర్, కాంగ్రెస్ ని బలపరుస్తాను అన్నాను కాని బలోపేతం చేస్తాను అన్లేదట , కానీ తెలంగాణా వాళ్ళకి ఈ సూక్ష్మం అర్ధం కాక ఆయన దిష్టి బొమ్మని తయారు చేసుకొని జేబులొ సార బుడ్డి కుక్కి మరీ కాల్చరు .
న్యూస్ మేకర్ రాంగోపాల్ వర్మ చిరంజీవి గారికి ఉచిత సలహా ఒకటి పడేసారు, చిరంజీవి గారు బాధితులని పరామర్శించే బదులు జల్ తుఫాన్ ని ఒక్క గుద్దు గుద్దితే సరిపోతుంది కదా అని .
మల్లికా శరావత్ ని కొత్త సవత్సరం వేడుకలలో చిందులు వేయడానికి ఎవరు ఆహ్వానిచడం లేదు అట , హిస్స్ తుస్స్ అవటం వల్ల కాబోలు .
నందమూరి కళ్యాణ్ రాం కి కత్తి సినిమా రిలీజ్ ముందు టెన్షన్ తో రెండు రోజులు నిద్ర పట్టలేదు అంట , రిలీజ్ అయ్యాక నందమూరి అభిమానులుకి నిద్ర లేదు .
ఆరెంజ్ సినిమా ఒక రేంజ్ లో వుంటుంది అంటున్నారు , పులి మాదిరి మీద పడి కరవకుండా వుంటే చాలు అనుకొంటున్నారు మెగా అభిమానులు , అన్నట్టు, ఆడియో హిట్ అయ్యింది.